మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు
 

తాడేప‌ల్లి:  మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు  ఈ 34 నెల‌ల్లో వారి కోసం ఖ‌ర్చు పెట్టిన 1.18 ల‌క్ష‌ల కోట్ల మొత్తమే సాక్ష్యమ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌ కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు రాజ‌కీయ నియామ‌కాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చ‌ట్టం చేశామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
మ‌హిళ‌ల‌కు ఇంకా మంచి చేయ‌డానికి కృషి చేస్తూనే ఉంటామ‌ని చెబుతూ చిన్నారుల‌కు, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, అవ్వ‌ల‌కు,  మహిళా లోకానికంత‌టికీ హృదయపూర్వక అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top