డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్‌ సేవలు నిరుపమానం

నేడు అంబేడ్కర్‌ వర్ధంతి సంద‌ర్భంగా  సీఎం వైయ‌స్ జగన్‌ నివాళులు

తాడేపల్లి: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్‌ చేసిన సేవలు నిరుపమానమని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి.. నివాళులు అర్పించారు. 

‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top