అంబేడ్కర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ ఘన నివాళి

 
  తాడేపల్లి : రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, అదిమూలం సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. 

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వమించారు.  అంబేడ్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్‌ జయంతి​ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ  చేయాలనుకున్నాం.. కానీ కరోనా వల్ల చేయలేకపోతున్నామని తెలిపారు. అంబేద్కర్‌, గాంధీ సిద్ధాంతాలకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారన్నారు. మహిళా సాధికారితకు సీఎం జగన్‌ పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని సజ్జల అన్నారు.

Back to Top