తాడేపల్లి: ఈనెల 23, 24, 25 తేదీల్లో సీఎం వైయస్ జగన్.. వైయస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం వైయస్‌ఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మూడు రోజుల పాటు జిల్లాలో çపర్యటించనున్న సీఎం.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 23వ తేదీ సాయంత్రం 3 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 4.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఎస్టేట్‌కు 4.55 గంటలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 24వ తేదీ పర్యటన.. ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 10.00 నుంచి 12.00 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 12.15 గంటలకు చర్చి నుంచి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు రోడ్డు మార్గాన బయల్దేరుతారు. 2.00 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 2.20 గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు, బస్సుడిపో, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3.05 గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్‌కు చేరుకుంటారు. 3.10 నుంచి 3.40 గంటల వరకు ఇమ్రా ఏపీకి శంకుస్థాపన చేస్తారు. 4.00 నుంచి 4.30 గంటల వరకు అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. 4.45 గంటలకు వైయస్‌ఆర్ జగనన్న హౌసింగ్ లే అవుట్ హెలిప్యాడ్ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు బయల్దేరి వెళతారు. 5.20 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ నుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 25వ తేదీ పర్యటన.. ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ నుంచి పులివెందుల భాకరాపురం బయల్దేరుతారు. 9.25 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.45 నుంచి 11.00 గంటల వరకు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.05 గంటలకు సీఎస్‌ఐ చర్చి నుంచి భాకరాపురం హెలిప్యాడ్‌కు బయలుదేరి 11.15 గంటలకు చేరుకుంటారు. 11.20 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళతారు.