మంత్రి విశ్వ‌రూప్‌ను ప‌రామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గుండె శస్త్రచికిత్స కోసం ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ సెంటర్‌లో మంత్రి విశ్వ‌రూప్‌ చేరారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ విశ్వ‌రూప్‌ను ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. శస్త్రచికిత్స విజయవంతం అవుతుందని ఆయనకు ధైర్యం చెప్పారు. మంత్రి సతీమణి బేబీమీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డిలతో కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో మాట్లాడారు. తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, విశ్వరూప్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుందని అన్నారు. ఈరోజు మంత్రికి శ‌స్త్ర చికిత్స చేయ‌నున్నారు.

తాజా వీడియోలు

Back to Top