మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మనది

 
అసెంబ్లీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

పేదల తలరాతలు మార్చే ఉద్యమానికి నాంది పలికాం

అమ్మఒడి పథకం ద్వారా అండగా నిలుస్తున్నాం

36.70 లక్షల మంది మహిళలకు వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక అందజేస్తున్నాం

పింఛన్ల కోసం ప్రతి నెలా రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నాం

అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ ఆసరా పథకం తెచ్చాం

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు 

రూ.1990 కోట్లతో వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం

31 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం

ఇళ్ల స్థలాలు, నిర్మాణాలను ఆపాలని చూసిన వారికి జనం మొట్టికాయలు వేశారు

ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన జనవరి 9వ తేదీన ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం

మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్‌ కల్పిస్తున్నాం

కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట

 మహిళల భద్రతలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ

 అమరావతి: మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మనదని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.   

బాబు వ‌స్తారేమో అనుకున్నాం..
మహిళా సాధికారతపై చర్చకు చంద్రబాబు వస్తారేమో అని అనుకున్నాం. ఆలస్యం చేసినా ఇంతవరకు రాలేదు. కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు రాలేదని మావాళ్లు అంటున్నారు.  మహిళా సాధికారత పై చర్చ జరుగుతున్నప్పుడు తాను కూడా ఉంటే బాగుంటుంది . ఇక్కడే ఉన్నాడు వచ్చేస్తారు అచ్చెన్నాయుడు అంటున్నారు. కానీ చంద్రబాబు  కనిపించలేదు.

మహిళా సాధికారతకు అర్థం తీసుకొని రావాలని..
రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల‌ జీవితాలు బాగుపడాలని, వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణా మంచి జరగాలని , అక్కా చెల్లెమ్మ‌లు బాగుండాలని ఒక ఉద్యమంగా.. ఒక విప్లవంగా మహిళా సాధికారతకు అర్థం తీసుకొని రావాలని , ఆర్థికంగానూ రాజకీయంగానూ ఎదగాలని గట్టిగా అడుగు వేస్తున్నాం. ఈ రెండున్న‌రేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌ల సంక్షేమం కోసం చేప‌ట్టిన ప‌థ‌కాల‌ను సువర్ణ అధ్యాయంగా లిఖించ‌వ‌చ్చు. ఆ అక్క చెల్లెళ్లకు అన్నగా..తమ్ముడు ఉంటూ ..త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపించే త‌ల్లుల‌కు దాదాపు 44 లక్షల 50 వేల మందికి,తద్వారా 85 లక్షల మంది పిల్లలకు మేలు జ‌రిగేలా ప్రతి సంవత్సరం జగనన్నఅమ్మఒడి ద్వారా అక్షరాల సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అంద‌జేస్తున్నాం.  ఒక గొప్ప విప్లవానికి నాంది పలికాం.

వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక‌:
గ‌తంలో పింఛ‌న్ మంజూరు కావాలంటే దారుణ‌మైన ప‌రిస్థితులు ఉండేవి. వైఎస్సార్ పెన్షన్ కానుక గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజమండ్రి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పింఛ‌న్లు రావ‌డం లేద‌ని ఆరోపించారు. టీడీపీ హ‌యాంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అంద‌రికీ తెలుసు. అప్ప‌ట్లో  పెన్షన్ రావాలంటే  జన్మభూమి కమిటీ సిఫార్సు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులుగా ఉండేవారు. గ‌తంలో ఎంత‌మందికి పెన్ష‌న్ ఇచ్చారో ఒక్కసారి చూస్తే పేరుకు 44 లక్షలు. ఇందులో ఇచ్చేది 90%  అంటే 39 లక్షల మందికి. ఇందుకోసం 400 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసేవారు.  మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెల నుంచి పింఛ‌న్ నెల‌కు రూ. 2250 రూపాయలు ఇచ్చాం. గ‌త‌ ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఖ‌ర్చు ఉంటే.. ఇవాళ రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్‌ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు వాలంటీర్లు అందిస్తున్నాం.    

వైయ‌స్ఆర్ ఆస‌రా..
 అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైయ‌స్సార్‌ ఆసరా పథకం తీసుకొచ్చాం. అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము. 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం.  అక్షరాల  78 లక్షల 76 వేల మందికి  ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వీళ్లకు జరిగే మేలు అక్షరాల రూ.25,500 కోట్లు అయితే ఇప్ప‌టికే   రూ. 12758 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పటి దాకా మరో 2354 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. గత పాలకులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేస్తే.. అప్పటిదాకా ఉన్న‌ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు సి గ్రేడ్, డీ గ్రేడ్ దిగజారిపోయాయి. మొత్తం పొదుపు సంఘాల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్య‌మైంది. అలాంటి పరిస్థితుల్లో  వైయస్సార్ ఆసరా పథకం, వైయస్సార్ చేయూత ద్వారా ప్రతి సంవత్సరం అదే అక్కచెల్లెమ్మ‌ల‌కు క్రమం తప్పకుండా అంద‌జేస్తున్నాం.   ప్రతి సంవత్సరం ఇవ్వడం వల్ల  వారు ఆర్థికంగా వ్యాపారాల్లో నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుంది.  అక్షరాల 24 లక్షల 56 వేలను  45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వారికి రెండు విడతలుగా ఇప్పటిదాకా 8940 నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.  వివిధ కార్పొరేట్ సంస్థలతో టై అప్ చేసి అక్కాచెల్లెమ్మ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేశాం. ఆవులు, బర్రెలు, గొర్రెల ద్వారా  దాదాపు మూడు లక్షల 40 వేల మందికి ఉపాధి అవకాశం క‌ల్పించాం. వైయ‌స్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం.  సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం.కాపు నేస్తం ద్వారా మహిళలకు అండగా నిలబడ్డాం. 3లక్షల 28 వేల మందికి రూ.982 కోట్ల మేర మేలు చేశాం. ఈబీసీ నేస్తం అనే కొత​ పథకానికి శ్రీకారం చుడతాం. వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేస్తాం.

31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు
మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక  31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. టీడీపీ నేత‌లు ఓర్వ‌లేక‌ ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారు. మంచి పథకాలు ఆపాలని చూడటం ధర్మమేనా?.  ఇంటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, డ్రైనేజీలు కూడా తయారైపోతుంది. మ‌న‌మిచ్చిన ఇంటి స్థ‌లం ఒక్కో మ‌హిళ‌ల‌కు రూ.5 నుంచి రూ.10 ల‌క్ష‌ల విలువ చేస్తుంది.  ఇటువంటి మంచి పథకాన్ని కూడా ఆపాలని చూడడం ధర్మమేనా? ఎక్కడ జగన్‌కు క్రెడిట్ వస్తుందోన‌ని ఇలా అడ్డుకుంటున్నారు. 

జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌

పేదింటి పిల్లలు బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలి. వారికి డ‌బ్బు అడ్డు కాకూడ‌ద‌నే ఉద్దేశంతో జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, విద్యా దీవెన ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. జగనన్న విద్యాదీవెన ద్వారా 18లక్షల 81వేల మందికి రూ.5,573కోట్లు చెల్లించాం.  ఆ పిల్లలను చదివించడం కోసం త‌ల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు. ఆ పిల్లలు బాగా చదవాలి ఆ చదువు కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్షరాల 15 లక్షల 50 వేల మంది ఇప్పటివరకు 2270 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చదివించాలని, పేదల తలరాతలు మార్చాలని మనసా వాచా కర్మణ ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికాం. 

మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
 వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30లక్షల 16వేల మందికి మేలు కలుగుతోంది. 77 గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాన్ని చేపట్టాం. 1990 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 77 షెడ్యూల్డ్  ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గా అడుగులు వేసింది.మహిళల భద్రతకు దిశా చట్టం తీసుకొచ్చాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. దిశా యాప్‌ ద్వారా 6,880 మందిని పోలీసులు కాపాడారు. మద్య నియంత్రణ కోసం పూర్తిగా బెల్ట్‌షాపులు తొలగించాం. మద్యం పట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచాం. మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను తీసుకొచ్చాం. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది.   

కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట
కేబినెట్‌లో మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద పీట వేశాం. ఒక చెల్లిని హోం మంత్రిని చేశాం. మ‌రో చెల్లిని, ఎస్టీ మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎంగా నియ‌మించాం. చరిత్రలో తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించాం.  మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు క‌ల్పించాం. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మహిళలకు 50 శాతం  రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.   నామినేటెడ్, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భ‌ర్తీలో మహిళలకు 51% నియామకాలు  చేప‌ట్టాం. కార్పొరేషన్ చైర్మన్ ప‌ద‌వులు 202 ఉంటే వాటిలో 102 చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వులు మ‌హిళ‌ల‌కే ఇచ్చాం. 1154 డైరెక్టర్ పదవులు ఇచ్చి అండ‌గా నిలిచాం.  కార్పొరేషన్, మున్సిపాలిటీలు , నగర పంచాయతీ చైర్మన్లుగా 52 శాతానికి పైగా మ‌హిళ‌ల‌నే నియ‌మించాం. 202 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌర‌వించాం.    

18 దిశ పోలీసు స్టేష‌న్లు..
రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం 18 దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ప్ర‌త్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశాం. దిశ చ‌ట్టం ఆమోదం కోసం కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించాం.  ప్ర‌తి మ‌హిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు తోడుగా మీ అన్న ఉన్న‌ట్లే..ఎస్‌వోఎస్ బ‌ట‌న్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు మీ వ‌ద్ద‌కు వ‌స్తారు. ఇప్పటి దాకా 6880 మంది మ‌హిళ‌ల‌ను పోలీసులు కాపాడారు.

మ‌ద్య‌పానం దిశ‌గా అడుగులు
మ‌ద్య‌పాన నిషేధం దిశ‌గా అడుగులువేస్తున్నాం. గ‌త టీడీపీ పాల‌న‌లో వీధి ఒకటి బెల‌ట్ షాపు ఉండేది. దాదాపుగా 44 వేల బెల్ట్ షాపులన్నీమ‌న ప్ర‌భుత్వం పూర్తిగా తీసేయడం జరిగింది. మద్యం దుకాణాలు ఇంతకుముందు 4381 ఉంటే వాటి సంఖ్యను తగ్గించి 2934 చేశాం.  మద్య విక్ర‌యాల‌ను నియంత్రిస్తూ రేట్లు భారీగా పెంచాం.  గతంలో నెలకు ముప్పై నాలుగు లక్షల కేసులు మ‌ద్యం విక్ర‌స్తే ఇప్పుడు ఒక లక్షా ఇరవై రెండు వేల కేసులు మాత్ర‌మే అమ్ముతున్నాం.   

ప్ర‌తి ఊరిలో మ‌హిళా పోలీసు
స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌తి ఊరిలో ఒక మ‌హిళా పోలీసును ఏర్పాటు చేశాం. పోలీసు స్టేష‌న్ల‌లో ప్ర‌త్యేక ఉమెన్ హెల్ప్‌లైన్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం.  మహిళల మీద నేరాలను వేగంగా స్పందించి అరికట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మహిళా భద్రత విషయంలో ఇప్పటివరకు దాదాపుగా 90 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేశారు. కేసుల‌పై పోలీసు దర్యాప్తు వేగ‌వంతం చేశాం.  42 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.   

మహిళలు ప్రతి రంగంలోనూ ఎదగాలన్న సంకల్పంతో మ‌న ప్ర‌భుత్వం మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌బ‌ట్టే దేవుడి దయతో రాష్ట్రంలో ఏ ఎన్నిక జ‌రిగినా కూడా ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీని గొప్ప‌గా ఆశీర్వ‌దిస్తున్నారు.  ప్ర‌తి ఎన్నిక‌లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కే ప్ర‌జ‌లు బ్రహ్మరథం పడుతున్నారు. అక్క‌చెల్లెమ్మ‌లు దీవించ‌బ‌ట్టే ఈ విజ‌యం.  ఇప్పటికైనా చంద్ర‌బాబుకు జ్ఞానోదయం అవుతుందేమో..ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో ఆశిద్దాం.  మొన్న జరిగిన కౌంటింగ్ లో 13 చోట్ల ఎన్నికలు జరిగితే 12 మున్సిపాలిటీ, కార్పొరేషన్ల‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కుప్పంలో జనం చంద్ర‌బాబుకు మొట్టికాయలు వేశార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 

  

తాజా ఫోటోలు

Back to Top