చ‌ప్ప‌ట్ల‌తో వారిని అభినందిద్దాం

రాష్ట్ర ప్ర‌జానీకానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

తాడేపల్లి: మన గ్రామాల్లోనే ఉంటూ మన ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మనకు ఏ సాయం అయినా వివక్ష లేకుండా.. లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికి వచ్చి మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థ స్థాపించి నేటితో సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యం మనందరికీ కళ్ల ఎదుటనే కనిపించే విధంగా సేవలు అందిస్తున్న ఈ వ్యవస్థను అభినందిస్తూ.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు తోడుగా మేమంతా ఉన్నామని చప్పట్లతో సంకేతం ఇస్తూ.. అభినందించాలని కోరారు. ‘‘అందరితో పాటు నేను కూడా సాయంత్రం 7 గంటలకు నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో, వలంటీర్లుగా పనిచేస్తున్న వారిని అభినందిస్తాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. 
 

Back to Top