పోర‌స్ ఫ్యాక్ట‌రీ ఘ‌ట‌న‌పై సీఎం దిగ్భ్రాంతి

మృతుల‌ కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశం

తాడేప‌ల్లి: అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమిక‌ల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌మాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున‌ పరిహారంగా ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని ఆదేశించారు.

Back to Top