తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం వైయస్ జగన్‌ భారీ ఆర్థిక సహాయం

రూ.35 లక్షల చెక్కును అందించిన ముఖ్యమంత్రి

పర్వతారోహణపై తుకారామ్‌కు అభినందన

హైదరాబాద్‌: తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. అతడి సాహస యాత్రను మెచ్చుకున్న సీఎం వైయస్ జగన్‌ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌ ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. 

ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైయస్ జగన్‌ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారామ్‌కు సీఎం జగన్‌ రూ.35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారామ్‌ తెలిపాడు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top