తాడేపల్లి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఇళ్ల నిర్మాణం, నూతనంగా నిర్మిస్తున్న వైయస్‌ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వంటి తదితర అంశాలపై సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.