తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు.