స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై స‌మీక్ష‌లో సీఎం వైయస్‌.జగన్ 

జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలి

వైయ‌స్ఆర్‌ ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం 

మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్ధ ఉండాలన్న సీఎం

ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం

రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలన్న సీఎం

 తాడేప‌ల్లి: గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో  స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌ చేయూత పథకం అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా మ‌హిళ‌ల‌కు జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సీఎం వైయస్‌.జగన్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఏమన్నారంటే...:

  • మహిళల స్వయం సాధికారితకోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది : సీఎం.
  • చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించిన సీఎం.
  • చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్న సీఎం.
  • అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం∙తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందన్న సీఎం. 
  • ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందన్న ముఖ్యమంత్రి.
  • దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
  • లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాదినుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీనివల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయన్న సీఎం. 
  • అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలన్న సీఎం.
  • మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్ధ ఉండాలన్న సీఎం.
  • దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలన్న సీఎం. 
  • 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం.
  • ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి పొందుతున్నారని అధికారులు వెల్లడి.
  • హిందుస్తాన్‌ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్‌ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయన్న అధికారులు. 
  • ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్, లేస్‌ పార్కు, ఇ– కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్‌ యార్డు పౌల్ట్రీ, ఆనియన్‌ సోలార్‌ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు.
  • గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో  స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు.
  • జిల్లాకు కనీసం రెండు సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన అధికారులు.
  • మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు.
  • ఒక్కో సూపర్‌ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్‌ లక్ష్యంగా ఏర్పాటు.
  • వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్‌, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామన్న అధికారులు.
  • మల్టీ నేషన్‌ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్‌ ఉండేట్టు ఏర్పాటు చేశామని వెల్లడి.
  • కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ యూనిట్‌లో 200 మంది మహిళలకు ఉపాధి.
  • ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం.
  • చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు.
  • ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత. 

ఉపాధి హామీపైనా సమీక్ష. 

  • ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం.
  • ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన
  • పనిదినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధిహామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యం.
  • మెటీరియల్‌ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యం.
  • మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం.
  • గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన ఉపాథిహామీ డబ్బులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని తెలిపిన అధికారులు.
  • ఈ డబ్బులు తెచ్చుకోవడంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
  • గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్కులు పూర్తిచేయాలన్న సీఎం.
  • గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం.

రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలన్న సీఎం.

  • రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలి:
  • వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదు:
  • ఆ మేరకు అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం
  • ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్, సెర్ప్‌ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top