భారీ వర్షాలు, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: భారీ వర్షాలు, సహాయక చర్యలపై సంబంధిత మంత్రులు, ఉన్న‌తాధికారులతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి‌ సమీక్షా సమావేశం చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జిల్లాల వారీగా వరద పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. వరదల కారణంగా నష్టపోయినవారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top