వరద బాధితులను మానవతా దృక్పథంతో చూడాలి

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

పునరావాస కేంద్రాల్లోని ప్రతిఒక్కరికీ రూ.500 తక్షణ సాయం

మంత్రులు, అధికారులను ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌

వరద నష్టం, సహాయక చర్యలపై సీఎం సమీక్ష

తిరుపతి: ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నివర్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. చిత్తూరు, నెల్లూరు వైయ‌స్ఆర్ జిల్లాల్లో ఏరియల్‌ సర్వే ద్వారా పంటనష్టాన్ని పరిశీలించారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్టులో మంత్రులు, అధికారులతో వరద నష్టం, సహాయక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద నష్టాలను మంత్రులు, ఉన్న‌తాధికారులు సీఎం జగన్‌ దృష్టికి తెచ్చారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏరియల్‌ సర్వేలో పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామన్నారు. వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సూచించారు. తుపాన్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైయస్‌ఆర్‌ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా, పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణసాయం అందించాలని ఆదేశించారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి అధికారులు నివేదిక అందించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top