స్కూళ్ల‌లో టాయిలెట్స్ ప‌రిశుభ్రంగా ఉండాలి

నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కాలేజీ, స్కూళ్ల స్థాయి కమిటీలు

మరుగుదొడ్ల క్లీనింగ్‌పై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, మనబడి నాడు–నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం ద్వారా అందుబాటులోకి నాణ్యమైన విద్య, విద్యార్థులకు పోషకాహారం కోసం గోరుముద్ద అమలు చేస్తున్నామన్నారు. విద్యాశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మనబడి నాడు–నేడు పనులపై, పాఠశాలల్లో టాయిలెట్స్‌ నిర్వహణపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను తయారు చేశామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. 

అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘టాయిలెట్ల నిర్వహణ నిధిపై రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, స్కూల్‌ లేదా కాలేజీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్ల పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రాధాన్యతా అంశం. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు స్కూళ్లకు పిల్లలు పోలేని పరిస్థితి నెలకొంది. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడు మరమ్మతులకు వచ్చినా వెంటనే బాగుచేసేలా చర్యలుండాలి. టాయిలెట్ల క్లీనింగ్‌పై కేర్‌టేకర్లకు అవగాహన కల్పించాలి’ అని సీఎం ఆదేశించారు. 

 

Back to Top