గులా బ్ తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తం

తాడేప‌ల్లి: గులా బ్ తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తం అయ్యింది. కాసేపట్లో జిల్లా కలెక్టర్ల తో సీఎం వై య‌స్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. సీఎం వైయ‌స్ జగన్ ఆదేశాల తో నిన్నటి నుండే రంగంలోకి దిగిన అధికారులు. శ్రీకాకుళంలో చీఫ్ సెక్రెటరీ ఆడిత్యనాథ్ దాస్ మకాం వేసి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి పై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు కు మార్గదర్శనం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సహాయ చర్యలు పర్యవేక్షణ చేస్తున్నారు. ముందుగానే ప్రజలను   విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ కలెక్టర్లుఅప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, గాలులతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెల్లవారు జాము నుండే సహాయ చర్యలు ప్రారంభించారు.
 

Back to Top