ప్రతీ గడపకూ వెళ్ళి అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికపై పార్టీ నేత‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం

 
 
తాడేప‌ల్లి: తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ప్రతీ గడపకూ వెళ్ళి ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ నేత‌ల‌కు సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే అభివృద్దిని, సంక్షేమాన్ని కొనసాగించనున్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికపై పార్టీ నేత‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.  ఉప ఎన్నికలో పోటీ చేయనున్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధి డాక్టర్‌ ఎం. గురుమూర్తిని పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరిచయం చేశారు. ‌

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫ‌లితాలు..
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేసిన విషయాన్ని, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ అందజేసిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ ముఖ్యనేతలకు సీఎం సూచించారు. స్ధానిక ఎన్నికలలో దేవుని దయ వల్ల మంచి ఫలితాలు వచ్చాయి, దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలను చూస్తారు, ఇక్కడి నుంచి వచ్చే  మెజార్టీ మన మెసెజ్‌ గా ఉండాల‌న్నారు. మహిళా సాధికారత, మహిళలకు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును కూడా తెలియజేయాల‌ని సూచించారు. 

అతి విశ్వాసం వ‌ద్దు..

తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్రతీ నియోజకవర్గానికి ఒక మంత్రి ఇంచార్జ్‌గా, ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్పష్టం చేశారు.  ప్రతీ ఓటర్‌కు జరిగిన మంచి గుర్తుచేయడం, మీ దీవెనలు, ఆశీస్సులు కావాలని అడగాలన్నారు.  పార్టీ నేతలకు అతి విశ్వాసం వద్దు, అందరూ సమన్వయం చేసుకుని పనిచేసి గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాల‌ని పార్టీ నేతలతో సీఎం శ్రీ వైఎస్‌ జగన్ అన్నారు. ‌

సమీక్ష స‌మావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలపు సురేష్, రీజనల్‌ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, రవీంద్రనాద్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధి, వరప్రసాద్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాద్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top