విశాఖ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలలో పాల్గొననున్న సీఎం
 

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు.  పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైయస్‌ జగన్‌ హాజరుకానున్నారు.  ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైయస్‌ జగన్‌  గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి  విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎంకు పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.  మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం వైయస్‌ జగన్‌ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top