క్రీడా మైదానంలో స‌ర‌దాగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరు: ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మైదానంలోకి అడుగుపెట్టారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ బ్యాట్‌ చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్‌ అథారటీ (శాప్‌) ఛైర్మన్‌  బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి సీఎంకు బౌలింగ్ చేశారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం వైయ‌స్‌ జగన్‌ను అలా చూసేసరికి తోటి మంత్రులు, అధికార యంత్రాగం, క్రీడాకారులంతా సంబురంగా చప్పట్లు కొట్టారు. త‌రువాత కబడ్డీ, ఖోఖో ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకెళ్లిన సీఎం.. కాసేపు బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ కోర్టుల్లోనూ సంద‌డి చేశారు.

Back to Top