`జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం` ప్రారంభం

గాజుల‌పాడులో మొక్క నాటిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా: 71వ వ‌న మ‌హోత్స‌వంలో భాగంగా `జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం` కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం గాజుల‌పాడుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. మొక్క‌లు నాటి జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీ‌నివాస్‌ పాల్గొన్నారు. వ‌న మహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Back to Top