మ‌హాత్మా పూలే, మ‌హానేత‌ వైయ‌స్ఆర్‌కు సీఎం నివాళి

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న బీసీ సంక్రాంతి సభకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ముందుగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుల‌ర్పించి.. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. అనంత‌రం సీఎం  బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైయస్‌ జగన్‌ను సత్కరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top