మహానేత వైయస్‌ఆర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

పులివెందుల: వైయస్‌ఆర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పులివెందుల నియోజకవ‌ర్గం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఘాట్‌ సమీపంలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. 

నేడు పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 

- 12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
- 1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 
- 1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 
- 1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్‌ ప్రారంభిస్తారు. 
- 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 
- 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 
- 3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్‌ వైయ‌స్ఆర్ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 
- 3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 
- 4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 
- 4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. 
- 5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

Back to Top