మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుటుంబాన్ని పరామర్శించిన‌ సీఎం

తాడేపల్లి: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ తల్లి థెరీసమ్మ అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈమేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్‌ నివాసానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. థెరీసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సురేష్‌ కుటుంబాన్ని పరామర్శించారు. థెరీసమ్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆదిమూలపు సురేష్, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. 

Back to Top