చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ప‌రామ‌ర్శించిన‌ సీఎం వైయ‌స్ జగన్  

తిరుపతి :  వైయ‌స్ఆర్‌సీపీ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి సోద‌రుడు హ‌నుమంత‌రెడ్డి నిన్న అనారోగ్యంతో మ‌ర‌ణించారు. దీంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి పరామ‌ర్శించారు. హ‌నుమంత‌రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ స‌భ్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సానుభూతి వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మెన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి,  పలువురు నేతలు హ‌నుమంత‌రెడ్డి భౌతిక‌కాయానికి నివాళులర్పించారు.  

Back to Top