అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మంగళవారం ఉదయం ఆయన 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11 గంటలకు తణుకు టౌన్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి రోడ్డులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. 1.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.