అసెంబ్లీ: ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోపు నేరస్తులకు ఉరిశిక్ష పడే పరిస్థితుల్లోకి చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఈ దిశగా ముందడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో దిశ ఘటనలో బాధితురాలు తల్లిదండ్రులు పడే బాధ చూసి నిందితులను కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నామన్నారు. అనుకోని పరిస్థితుల్లో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హ్యాట్సాఫ్ టు కేసీఆర్, హ్యాట్సాఫ్ టు తెలంగాణ పోలీస్ అని సీఎం వైయస్ జగన్ అన్నారు. మన రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్‌ను ప్రవేశపెట్టామన్నారు. తాగితే మనుషులు రాక్షసులు అవుతారు.. అందుకే వైన్‌షాపుల వద్ద పర్మిట్‌రూమ్‌లను రద్దు చేశామన్నారు మద్యపాన నియంత్రణ అమలు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం వచ్చి ఇప్పటి ఆరు నెలలు అవుతుంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు. - 2014లో మహిళలపై జరిగిన నేరాలు 13549, 2015లో 13088, 2016లో 13948, 217లో 14696, 2018లో 14048 కేసులు నమోదు అయ్యాయి. కట్నం కోసం హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు, రేపు కేసులు వంటివి జరిగాయి. - 2014లో రేపుకేసులు 937, 2015లో 1014, 2016లో 969, 2017లో 1046, 2018లో 1096 నమోదయ్యాయి. చిన్నపిల్లలపై జరిగిన అత్యాచారాలు 2014లో 4032 కేసులు, 2015లో 4114 కేసులు, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు నమోదు అయ్యాయి. - అదేవిధంగా కొంతమంది పెద్ద నాయకులు కూడా ఈ మధ్యకాలంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు సరిపోరు నలుగురు భార్యలు కావాలని రకరకాలుగా జరుగుతున్నాయి. ఇలాంటి కేసులు 2014లో 216, 2015లో 264 కేసులు, 2016లో 240 కేసులు, 2017లో 260 కేసులు, 2018లో 195 కేసులు నమోదు అయ్యాయి. - పోస్కోయాక్టు ప్రకారం ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందే ఈ గణాంకాలు చూస్తే అర్థం అవుతుంది. 2016లో 830 కేసులు, 2017లో 1069, 2018లో 1229 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు వేలెత్తి చూపించాలని, ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని చెప్పాలనుకున్నాడు. ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వమని అడిగితే... వేలెత్తి చూపించాలని చేసిన విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా.. జరుగుతున్న ఘటనలు నన్ను కలచివేసింది. జరుగుతున్నది సరిగ్గా లేదని నా మనస్సు కదలిచివేసింది కాబట్టే దీన్ని మార్చాలని తపన, తాపత్రయంతో ఏం చేయగలుగుతే మార్పు తీసుకురాగలుగుతామని సలహాలు, సూచనలు అడుగుతున్నాం. Read Also: మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం హైదరాబాద్‌లో దిశ సంఘటన సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన. డాక్టర్‌ను టోల్‌గేట్ వద్ద నలుగురు వచ్చి బైక్‌ను పంక్చర్ చేసి ఆమెను అక్కడే ఉండేట్లుగా చేసి బైక్ పంక్చర్ చేసి తీసుకొస్తామని నమ్మించి పక్కకు తీసుకెళ్లి రేప్ చేసి కాల్చేసిన ఘటన మన కళ్లముందే కనిపిస్తుంది. అలాంటి ఘటన జరిగినప్పుడు పోలీసులు, రాజకీయ నాయకులు ఎలా స్పందించాలని ఆలోచన చేస్తే.. ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే.. మనం, మన పోలీసులు ఎలా స్పందించాలని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ఘటన చూసిన తరువాత.. ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ చూసిన తరువాత నిందితులను కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాకు చెల్లెలు ఉంది. నాకూ భార్య ఉంది. నా పిల్లలకు ఏమైనా జరిగితే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి.. నేరస్తులకు ఏరకమైన శిక్ష వేస్తే ఉపశమనం కలుగుతుందని ఆలోచన చేయాలి.. మీడియా చానళ్లు చూపించాయి. హ్యాట్సాఫ్ టూ కేసీఆర్, తెలంగాణ పోలీసులకు అని చట్టసభలోనే చెబుతున్నా. జరగకూడని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో హీరో ఎన్‌కౌంటర్ చేయిస్తే అందరూ చప్పట్లు కొడతారు.. నిజ జీవితంలో దమ్మున్నోళ్లు ఏదైనా చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా ఎందుకు చేశారని నిలదీస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి. ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి. ఒక ఇన్సిడెంట్ జరిగితే... ఒక నిర్భయ కేసులో.. నిర్భయ చట్టం తీసుకొచ్చామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే పడాలని చట్టం తెచ్చారు. ఆ చట్టం నాలుగు నెలల్లో తీర్పు ఇచ్చి శిక్ష విధించాలని చెబుతుంది. ఏడేళ్లు అవుతుంది నిర్భయ కేసులో ఇవాల్టీకి శిక్షపడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి చెల్లి, ప్రతి అక్క ఎదురుచూస్తుంది.. ఏదైనా జరిగితే వెంటనే ఏదైనా చర్య జరగాలని ఎదురుచూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో మన రాష్ట్రం కూడా అదే దిశగా ఆలోచన చేస్తుంది. ఎవరైనా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొవాలని ఎవరూ అనుకోరు. జరుగుతున్న జాప్యం చూసినప్పుడు, శిక్ష పడదు.. నేరస్తులు తప్పించుకుంటారు అనిపించినప్పుడు ఎన్‌కౌంటర్ చేసినా వారిని హీరోలుగా భావించేలా మన సమాజం ఉంది. ఈ చట్టాలు మారాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే పరిష్కారం దొరకాలి. చట్టాలు ఇంకొంత బలపడాలి. రెడ్‌హ్యాండెడ్‌గా ఇలాంటి నేరాలు చేస్తున్న వ్యక్తులను ఏం చేయాలో మనం ఆలోచన చేయాలి. కొన్ని దేశాల్లో అయితే ప్రజల ముందే కాల్చేస్తారు. మన దేశంలో ఇంకా కొంత చట్టాలు సవరించాలంటే.. వారం రోజుల్లోపు విచారణ పూర్తిచేసి రిపోర్టులు కంప్లీట్ చేసి. ఆ తరువాత రెండు వారాల్లోపు ట్రయల్ కూడా కంప్లీట్ చేసి 21 రోజుల్లోపు వీళ్లకు ఉరిశిక్ష పడే పరిస్థితుల్లోకి చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఈ దిశగా ముందడుగులు వేస్తున్నాం. ఆడవారు, చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, భద్రతపై ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ముందుకెళ్తాం. సోషల్ మీడియాను కూడా చూస్తున్నాం. వేరే వ్యక్తులపై బురదజల్లడం కోసం ఎటువంటి మనస్సాక్షి లేకుండా సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో దిగజారిపోయింది. ఆ సోషల్ మీడియాలో కూడా ఆడవారిని రక్షించే కార్యక్రమం జరగాలి. ఆడవారిపై నెగిటివ్ పోస్టింగ్ చేస్తే వారికి శిక్ష పడుతుందనే భయం ఉంటే తప్ప మార్పు రాదు. ఆ దిశగా కూడా చట్టాల్లో మార్పులు తీసుకువస్తాం. సెక్షన్ 354ఈ ప్రవేశపెట్టే ఆలోచనలు కూడా చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత జీరో ఎఫ్ఐఆర్ అని ప్రవేశపెట్టాం. ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగినా ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా ఫిర్యాదులు చేసేలా తీసుకువచ్చాం. ఇది కూడా చట్టం పరిధిలోకి తీసుకువస్తాం. మనిషి రాక్షసుడు ఎప్పుడవుతాడు.. సెన్స్ ఎప్పుడు కోల్పోతాడని గమనిస్తే.. మనిషి ఎప్పుడైనా తాగితే.. ఆ తాగే సమయంలో ఇంకో నలుగురు జత అయితే.. మనుషుల ఆలోచనలు మారుతాయి. రాక్షసులు అవుతారు. ఇది జరగకూడదనే పర్మిట్‌రూమ్‌లు రద్దు చేశాం. మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తున్నాం. గ్రామాల్లో 43 వేల బెల్టుషాపులను రద్దు చేశామని సగర్వంగా చెబుతున్నాం. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలను చెడగొట్టేది స్మార్ట్‌ఫోన్. ఫోన్‌లో ఇంటర్నెట్, దాంట్లో జరిగే అశ్లీల వెబ్‌సైట్స్.. ఎన్ని బ్యాన్స్ ఉన్నా.. ఇప్పటికీ వెబ్‌సైట్లను కట్టడి చేయని పరిస్థితి. ఇవన్నీ మార్పు చేయాలి. బుధవారం ఇదే చట్టసభలో మరో విప్లవాత్మక బిల్లును తీసుకువస్తామని సగర్వంగా చెబుతున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. Read Also: మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం