తాడేపల్లి: పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే లక్షా 65 వేల కోట్లు జమ చేశామని సీఎం వైయస్ జగన్ అన్నారు. అమ్మ ఒడి ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీలో 3 వేల చికిత్సలు ఇస్తున్న ప్రభుత్వం మనదే. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలి. లబ్ధిపొందుతున్న వారికి మరోసారి తెలియజెప్పాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. ♦సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు ఎప్పుడూ కూడా ఇంతగా ప్రయత్నాలు చేయలేదు ♦ఎస్‌డీజీకు సంబంధించి మనం ఇంత బాగా చేస్తున్నా కూడా, సమర్థవంతమైన రిపోర్టింగ్ కూడా అవసరం ♦రిపోర్టింగ్ మానిటరింగ్ అనేది సక్రమంగా జరగనప్పుడు ఎంత బాగా పనిచేసినా లాభం లేదు ♦ఇప్పుడు జాతీయ స్ధాయిలో పోటీపడ్డం ద్వారా...దేశంలో తొలిస్ధానంలో నిలబడ్డానికి అవకాశం వచ్చింది ♦గతంలో ఈ పరిస్థితి లేదు, మరేరాష్ట్రంలో ఇన్ని పథకాలు లేవు ♦తొలిసారిగా మనం చేస్తున్నాం ♦క్యాలెండర్ ప్రకారం మిస్ కాకుండా.. ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్ ప్రకటిస్తున్నాం ♦డీబీటీ ద్వారా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు పోతున్నాయి ♦అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచ్యురేషన్ మోడ్‌లో ఈ పథకాలు.. అందిస్తున్నాం ♦జిల్లాల్లో కలెక్టర్లు ఎస్‌డీజీ రిపోర్టును మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి ♦విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం ♦ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ ♦ప్రతి నెలా ఎస్‌డీజీ రిపోర్టును కలెక్టర్ పర్యవేక్షణ చేయాలి ♦సచివాలయం నుంచి డేటా జిల్లా స్ధాయికి చేరాలి ♦వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు ♦ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ మనం చేస్తున్న కృషి మరే రాష్ట్రంలోనూ లేదు ♦ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్‌ఇచ్చి బటన్ నొక్కి ఎంఎస్‌ఎంఈలకు టైం ప్రకారం ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం ♦దేశంలో ఎక్కడా ఇలా జరగడం లేదు.. రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు ♦గత ప్రభుత్వ ఇన్సెంటివ్‌లకు సంబంధించిన బకాయిలు కూడా మనమే చెల్లించాం ♦ప్రతిరంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్ వేయగల పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి ♦అమ్మ ఒడి, టీఎంఎప్, ఎస్‌ఎంఎఫ్‌లను సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదు ♦సంపూర్ణ పోషణ, గోరుముద్ద కూడా సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదు ♦విద్యాకానుక, విద్యా దీవెన, పుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.20 వేలు వసతి దీవెన గతంలో ఎప్పుడూ జరగలేదు ♦ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీలో దాదాపు 3వేల చికిత్సా విధానాలు, 16 కొత్తమెడికల్ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో మొత్తం ఆసుపత్రుల పునర్‌వ్యవస్ధీకరణ, ఆరోగ్య ఆసరా ఇవేవీ గతంలో లేవు. ♦మహిళా సాధికారతలో చేయూత, ఆసరా, అమ్మఒడి, సున్నావడ్డీ, మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో ఎప్పుడూ జరగలేదు. ♦ఒక్క బటన్ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసింది. దేశంలో ఈ తరహా డీబీటీ విధానం లేదు. ఇవన్నీ కచ్చితంగా ప్రతిబింబించాలి ♦ఎస్‌డీజీకి సంబధించిన కచ్చితంగా ఎస్‌ఓపీలు ఉండాలి ♦వాటిని నిరంతరం పాటించాలి ♦ఎన్ని రోజులకొకమారు సమావేశం కావాలన్నదానిపై నిర్ధిష్టమైన సమాచారం ఉండాలి ♦గతేడాది ఇది లోపించింది, ఈ దఫా అలా జరగడానికి వీలులేదు ♦కచ్చితంగా ఎస్‌డీజీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్ డేట్ చేయాలి ♦విద్యాశాఖలో నూటికి నూరుశాతం ఎస్‌డీజీ లక్ష్యాలను సాధించాలన్న సీఎం ♦ప్రతినెలా సీఎస్ ఆధ్వర్యంలోనెలకు రెండుదఫాలుగా సమావేశం కావాలి ♦మూడు నెలలపాటు ఇలా సమావేశమవ్వాలి ♦ఎస్‌డీజీ మీటింగ్‌లో సెక్రటరీలు పాల్గొనాలి ♦కలెక్టర్లతోనూ మాట్లాడాలన్న సీఎం ♦దాదాపు 7నుంచి 8 రంగాలలో వైద్యఆరోగ్యరంగం, విద్య, మహిళాసాధికారత, గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్, సోషల్ జస్టిస్, మున్సిపల్‌శాఖ, పట్టణాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం: అధికారులకు సీఎం నిర్దేశం. ♦విశాఖపట్నంలో ఐటీహబ్‌ను నిర్మించాలన్న సీఎం.. దీనిపై కార్యారణ రూపొందించాలన్నారు. అత్యాధునిక వసతులతో నిర్మించాలన్నారు. సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.