అధికారమంటే అజమాయిషీ కాదు..మమకారం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

3,39,096 మంది ఖాతాల్లో రూ.137 కోట్లు జమ

కొత్తగా అర్హులైన 3.39 లక్షల మందికి ప్రయోజనం

కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు

ఇంటి గడప వద్దే సంక్షేమ పథకాలు అందుతున్నాయి

పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలు వారి తలుపులు తడుతున్నాయి

గత ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు

మంచి చేశాం కాబట్టే మళ్లీ మీ గడపకు రాగలుగుతున్నాం

మీరు సంతోషంగా చెబుతున్న మాటలే మాకు ఆక్సిజన్‌

తాడేపల్లి: అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా..  తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింద‌న్నారు. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద‌న్న‌దే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వ సంకల్పమమ‌ని మ‌రోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రులకు, అధికారులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  వ‌ర్చువ‌ల్ విధానంలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ల‌బ్ధిదారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. 

 ఈ సందర్బంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఏమ‌న్నారంటే..

  • ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఏ ఒక్కరూ కూడా మిస్‌ కాకూడదు. అర్హత ఉండి కూడా ఏ  ఒక్కరికి మిస్‌ అయ్యే పరిస్థితి రాకూడదన్న మన ప్రభుత్వం పడుతున్న తపన,తాపత్రాయానికి ఈ రోజు ఒక నిదర్శనం.
  • అధికారమంటే ప్రజలపై కేవలం అజమాయిషీ కాదు..అధికారమంటే ప్రజల మీద మమకారమని మరొక్కసారి రుజువు చేస్తూ ఈ రోజు దాదాపు 3. 40 లక్షల మందికి వివిధ పథకాలను, గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన అర్హులందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా రూ.137 కోట్లను 3.40 లక్షల మందికి నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయడమే కాకుండా..
  • కొత్తగా పింఛన్‌కార్డులు, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ..ఈ మూడింటికి సంబంధించి ఈ రోజు మరో 3.10 లక్షల కుటుంబాలకు మంచి చేస్తూ కొత్త కార్డులు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతోంది. అదనపు కార్డులు ఇవ్వడం వల్ల దాదాపుగా మరో రూ.935 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా భారం పడనుంది. అయినా కూడా ఈ కార్యక్రమాల ద్వారా ఇస్తున్నాం. 
  • అర్హుత ఉండి పథకాలు రాని పరిస్థితి ఉండకూడదు. పేదవారికి ఉన్న కష్టాలు మన కష్టాల కన్నా ఎక్కువగా అని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.
  • మిగిలిపోయిన 3.40 లక్షల మందికి ఈ రోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది.
  • ఇంతకుముందు ముత్యాలనాయుడు మాట్లాడుతూ..ఏయే పథకంలో ఎంత మంది లబ్ధిదారులు లబ్ధిపొందుతారని చెప్పారు.
  • ఈ బీసీ నేస్తం–6965 మంది, జగనన్న చేదోడు 15215 మంది, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా 16277 కుటుంబాలు, రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ దాదాపుగా 67 వేల కుటుంబాలు, జగనన్న విద్యా దీవెన 17150, జగనన్న వసతి దీవెన 25 వేల మంది, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీకి సంబంధించి అర్బన్‌ ఏరియాల్లో 2.04 లక్షల మంది, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు 12013 మంది, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ 2019–2020కి సంబంధించి మరో 713 మంది, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం కింద మరో ‡1249 మంది, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర కింద 236 మంది, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద 42 మంది..ఇలా మొత్తంగా 3.40 లక్షల మందికి వివిధ కారణాల వల్ల అర్హత ఉండి కూడా ఆ సంక్షేమ పథకాలు అందుకోలేని అర్హులకు నేడు వారందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ పథకాలు నేరుగా వారిబ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరుగుతోంది. 
  • పైన చెప్పినట్లుగా 12 పథకాలతో పాటు ఇంతకు ముందు చెప్పినట్లు మరో 2,99,085 మందికి పెన్షన్‌ కార్డులు, మరో 7051 మందికి బియ్యం కార్డులు, మరో 3031 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఈ రోజు అర్హుల చేతికి నేరుగా అందించబోతున్నాం.
  • ఇవన్నీ కూడా ఒక బాధ్యతతో, ఆ పేదలపై ఉన్న మమకారంతో చేస్తున్నాం. ఇక్కడ కులం చూడటం లేదు. మతం చూడటం లేదు. పార్టీ చూడటం లేదు, వర్గాలు చూడటం లేదు.
  • గతంలో మాకు ఓటు వేయకపోయినా కూడా పట్టించుకోవడం లేదు. అర్హత ఒక్కటే ప్రాతిపాధికగా తీసుకొని నవరత్నాల పాలన ఈ రోజు అందిస్తామన్న మాటకు కట్టుబడి ఏ  ఒక్క అర్హుడు మిగిలిపోకుండా వారికి మళ్లీ అవకాశం ఇచ్చి..అర్హులను మరోసారి గుర్తించే కార్యక్రమం చేయించి, ప్రతి ఏటా కూడా రెండు దఫాలుగా జూలై, డిసెంబర్‌లో ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా కచ్చితంగా అందరికి మంచి చేసే కార్యక్రమాలు చేశాం.
  • గత డిసెంబర్‌ 28వతేదీన 9.31 లక్షల మందికి మేలు చేస్తూ రూ.731 కోట్లు జమ చేశాం. అదేవిధంగా ఈ రోజు 3.40 లక్షల మందికి మంచి చేస్తూ రూ.137 కోట్లు ఈ రోజు జమ చేస్తున్నాం.
  • అర్హులు ఎంత మంది ఉన్నా కూడా శాచ్యూరేషన్‌ ప్రకారం అర్హులందరికీ కూడా ఇవ్వాలని, ఏ ఒక్కరికి మిస్‌ కాకూడదని తపన పడే ప్రభుత్వం మనది.
  • గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. పథకాలను ఎలా కత్తరించాలి. ఎలా ఎగ్గొట్టాలి. పార్టీల వారీగా, కులాల వారీగా, ఫలాన వారు వ్యతిరేకమని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని, గ్రామాల్లో ఇంతే కోటా అంటూ ఎగ్గోట్టే కార్యక్రమాలు ఉండేవి. ఇచ్చేవి కూడా అరకొరనే. తేడా గమనించండి.
  • ఇవే సంక్షేమ పథకాల లబ్ధి కోసం చాలా చోట్ల పెన్షన్లు  ఇచ్చేది అరకొర, ఇచ్చే వెయ్యి కూడా ఆత్మాభిమానం చంపుకొని కాళ్లు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పింఛన్లు ఇచ్చేవారు కాదు. తిరిగినా లంచాలు ఇవ్వకతప్పదు. లంచాలు ఇచ్చినా మీరు ఏ పార్టీ వారు అని అడిగేవారు. గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు చాలా చూశాం. తేడా గమనించండి. 
  • గత పాలనకు, మన పాలనకు తేడా ప్రస్ఫూటం కనిపిస్తోంది. మన పాలనలో మనసు ఉంది. ఆ పాలనలో మనసు లేకపోవడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గమనించండి.
  • ఇదే మనందరి ప్రభుత్వంలో గమనిస్తే కులం, మతం, వర్గం, పార్టీలు చూడటం లేదు. అన్నింటికి అతీతంగా, అవినీతికి, వివక్షకు అవకాశం ఇవ్వకుండా, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ఆరాటపడుతోంది. 
  • పథకాలను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తూ  సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ,వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, మరి అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి అర్హుల ఎంపికలో ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. 
  • ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా అర్హుల ఎంపిక చేశాం కాబట్టి..రేషన్‌ కార్డులు, సంక్షేమ పథకాల అర్హుల సంఖ్యను గమనిస్తే గతానికి, ఇప్పటికీ కొన్ని లక్షల తేడా కనిపిస్తుంది.
  • మన ప్రభుత్వంలో దళారులు లేరు. మధ్యవర్తులు లేరు. లంచాలు, వివక్ష ఎక్కడా కూడా కనిపించకుండా ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టే గొప్ప విప్లవాత్మక మార్పు ఈ రోజు జరుగుతోంది. 
  • బ్యాంకుల్లో జమ చేసే మొత్తాన్ని కూడా పాత అప్పులకు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు అకౌంట్ల ద్వారానే ఇచ్చే విధంగా ఈ రోజు అడుగులు ముందుకు పడుతున్నాయి.
  • ఏ నెలలో ఏ పథకం వస్తుందోనని ముందుగానే సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి కచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇలా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి ఏ నెలలో ఏ పథకం  ఇస్తున్నామో ముందుగానే ప్రకటిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాదు..దేశంలో కూడా ఎక్కడా జరగలేదని గుర్తించుకోవాలి.
  • ఒక్క మాటలో చెప్పాలంటే పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలు ఈ రోజు లబ్ధిదారుల తలుపులు తడుతున్నాయి.
  • ప్రభుత్వ సేవలు ఇంటి గడప వద్దే ఈ రోజు అందుతున్నాయి. అప్పటికీ ఇ ప్పటికీ తేడా అంత ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. ఇది ఒక గొప్ప మార్పుకు శ్రీకారం. ఈ తేడాలన్నింటిని కూడా ఒక్కసారి గమనించడమే కాకుండా తేడాలను ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి.
  • ఇంత మంచి చేశాం కాబట్టే మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నాం. సగర్వంగా, మంచి చేయగలిగాం కాబట్టే ఈ రోజు ప్రతి ఇంటికి గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మీ ఇళ్లకు వస్తున్నాం. ప్రతి అక్కను పలకరించి ఈ మూడేళ్లలో ఏ పథకం ద్వారా ఎంత మంచి జరిగిందో చెబుతున్నాం. అలా చెప్పినప్పుడు అవునయ్య, జరిగిందయ్య అని సంతోషంగా చెబుతున్నారు. ఈ మాటలే మన ప్రభుత్వానికి ఒక ఆక్సిజన్‌. వారి మాటలే మన వెన్నుతట్టి మన ప్రభుత్వానికి కాన్ఫిడెన్స్‌ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాయి. 
  • ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే..ప్రభుత్వంలో ఉన్నవారిలో ఒక నిబద్ధత ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వారికి క్రెడిబులిటీ, క్యారెక్టర్‌ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మంచి పాలన కనిపిస్తుంది. మార్పు కనిపిస్తుంది.
  • దేవుడి దయతో ఇవాళ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మంచి చేసేందుకు దేవుడు అవకాశం ఇవ్వాలని , దేవుడి దయతో ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని, ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
  •  
Back to Top