అజిత్‌ సింగ్‌ మృతి పట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతాపం

 తాడేప‌ల్లి:  రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్ సింగ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా అజిత్ సింగ్ రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మాజీ  మంత్రి అజిత్ సింగ్(82) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 రాష్ట్రీయా సేవా స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు, ప‌ద్మశ్రీ అవార్డు గ్ర‌హీత డాక్ట‌ర్ గుత్తా మునిర‌త్నం మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం వ్య‌క్తం చేశారు.ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top