వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం వైయ‌స్ జగన్‌ నివాళులు

వైయ‌స్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇడుపుల‌పాయ‌లో త‌న తండ్రి  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్ వ‌ద్ద మ‌హానేత‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  ముందుగా ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయ‌స్ జగన్‌, ఆయ‌న‌ తల్లి విజయమ్మ, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైయ‌స్ విజ‌య‌మ్మ ప్ర‌త్యేక ప్రార్థ‌న చేసి కుమారుడికి ఆశీస్సులు అందించారు. అనంత‌రం బ‌స్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం వైయ‌స్ జగన్‌. కాసేపట్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న సీఎం వైయ‌స్ జగన్‌..మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం వైయ‌స్ జగన్‌. 

Back to Top