తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం వైయస్ జగన్ స్వాగతం పలకనున్నారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు సీఎం వైయస్ జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.