ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. మ‌ధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించ‌నున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భేటీ కానున్నారు.

Back to Top