ఇప్పటి దాకా గుడులు పగలగొట్టేవారు..రేపు బడులపై విధ్వంసం చేస్తారేమో?

అమ్మ ఒడి కార్యక్రమం సభలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకొచ్చాం
 
పిల్లలను బడికి పంపిస్తే రూ.15 వేలు సాయం అందిస్తున్నాం

వరుసగా రెండో ఏడాది కూడా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం

వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తాం

ప్రతి గ్రామానికి ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తాం

రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు

కోవిడ్‌కు భయపడి చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌లో దాక్కుంటారు

సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటారు

పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు

వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం

రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోంది

విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు: ఇవాళ ఆలయాల్లో విగ్రహాలు పగలగొడుతున్నారు..రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం చేస్తారేమో అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాన్యులకు రక్షణ లేకుండా ఎన్నికలకు నిర్వహించాలంటున్నారని, lవిద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకువచ్చామని, అమ్మ ఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. నెల్లూరు పట్టణంలో రెండో విడత అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున జమ చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే దాదాపు 45 లక్షల మంది అక్కా చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు కనిపించే ఘడియ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదవాలనే ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామ రక్ష. అటువంటి పిల్లలు చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మ ఒడి పథకం శ్రీరామ రక్ష అని గర్వంగా చెబుతున్నా. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. పెద్ద చదువులు చదవాలి. వారి తలరాతలు మారాలి. అది జరగాలంటే చదువుల రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలి. ఆ దిశగా ఈ 19 నెలల పాలన సాగిందని గర్వంగా చెబుతున్నా. పేదరికం వల్ల పనులకు వెళ్తున్న అక్కచెల్లెమ్మలు ఫీజులు కట్టలేక కూలి పనులకు పంపించిన దృశ్యాలు నా పాదయాత్రలో చూశాను.  ఇటువంటి పరిస్థితులు మారాలని జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే శ్రీకారం చట్టాను. రెండో దఫా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఉచిత ప్రోత్సాహక ఆర్థికసాయం అందించే అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 1 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు ఈ సహాయాన్ని అందిస్తున్నాం. అమ్మ ఒ డి కార్యక్రమం ద్వారా పిల్లలను చదివిస్తున్న 44.37 లక్షల మందికి రూ.6,400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మ ఒడిగా అందిస్తున్నాం. నిరుడి సంవత్సరం 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే, ఈ ఏడాది 84 లక్షల మంది పిల్లలకు  ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతోంది. ప్రభుత్వ బడులు చూస్తే..దాదాపుగా 38 లక్షల మంది గతంలో చదివేవారు. ఈ రోజు 42 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు వెళ్తున్నారు. గతం కన్నా 4 లక్షల మంది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ బడులకు మారారు. నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, కోవిడ్‌ సమయంలో కూడా పేదింటి తల్లులకు ప్రభుత్వం ఒక నమ్మకం ఏర్పడింది. మా బిడ్డలను వారి మేనమామ చూసుకుంటారని నమ్మకంగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. అందుకే ప్రభుత్వ బడుల్లో సంఖ్య పెరుగుతోంది. 

గత ప్రభుత్వ హయాంలో ఏవిధంగా ఉండేదని గమనిస్తే..ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేశారు. జూన్‌లో బడులు తెరిస్తే..అక్టోబర్‌ ఇచ్చినా కూడా పుస్తకాలు ఇచ్చేవారు కాదు. మధ్యాహ్నం భోజనం క్వాలిటీ లేకుండా ఉండేది. బిల్లులు 8 నెలలకు పైగా పెండింగ్‌ పెట్టారు. తినే తిండికి క్వాలిటీ లేదు. పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రైవేట్‌ స్కూళ్లలోనే ఇంగ్లీష్‌ మీడియం దొరికేది. బడుల్లో కనీసం బాత్‌రూములు కూడా సరిగ్గా ఉండేవి కావు. ఒకవైపు ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ప్రైవేట్‌ బడులకు ఫీజులు విఫరీతంగా పెంచేలా పర్మిషన్లు ఇచ్చేవి. దీనివల్ల చదువుకే దూరమయ్యే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల బిడ్డలు ఏ ఒక్కరూ చదువులకు దూరంగా ఉండకుండా ఈ మేనమామ పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు పిల్లల భవిష్యత్‌ గురించి జగన్‌ మామ ఈ రోజు మరో నిర్ణయం చెప్పబోతున్నాడు. ఒక నుంచి పిల్లలు ఒక్క రోజైనా కూడా బడికి రాకపోతే ఫోన్‌లో మెసేజ్‌ వస్తుంది. రెండు రోజులు పిల్లలు బడికి రాకపోతే వాలంటీర్‌ నేరుగా మీ ఇంటికి వచ్చి ..ఆ పిల్లల యోగక్షేమాల గురించి విచారణ చేస్తాడు. పిల్లలను బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదేతే..వారు బడికి రాకపోతే నచ్చజెప్పే బాధ్యత సచివాలయాలు, వాలంటీర్లపై పెడుతున్నాం. తల్లిదండ్రుల కమిటీ, టీచర్లపై కూడా బాధ్యత పెడుతున్నాం. పేద, మధ్యతరగతి ప్రజల తలరాతలు మార్చేందుకు చదువుకునేలా వచ్చే మూడేళ్లలో నూటికి నూరు శాతం పూర్తిగా చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడతాం.  ప్రతి పిల్లాడు బడిబాట పట్టాలి. వచ్చే మూడేళ్లు దీనిపై దృష్టిపెడుతున్నాం.

నాడు–నేడు ద్వారా బడి రూపురేఖలను మార్చుతున్నాం. మన బడులు ఎలా ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి. 15,7500 బడులను మొదటి దశలో రూపురేఖలు మార్చేశాం. ఆడపిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు టాయిలెట్లు నిర్మించడమే కాకుండా, వాటి నిర్వాహణ కోసం అమ్మ ఒడిలోని 15 వేలలో ఒక్క వేయ్యిని టాయిలెట్‌ నిర్వాహణకు కేటాయిస్తున్నాం. చదువుల కోసం మన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.24 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే..జగనన్న అమ్మ ఒడికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. జగనన్న వసతి దీవెన, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు కోసం ఖర్చు చేశాం. ఇంత చేసిన ప్రభుత్వానికి రూ.1000 భారం కాదు. కానీ బడుల్లో వారీ టాయిలెట్ల మెయింటెన్స్‌ కోసం ఖర్చు చేస్తే పరిస్థితి మెరుగవుతుంది. మా వద్ద నుంచి డబ్బులు ఇచ్చాం ..ఎందుకు టాయిలెట్లు బాగోలేవని హెచ్‌ఎం, స్కూల్‌ కమిటీలను ప్రశ్నించవచ్చు. మెయింటెనెన్స్‌ కోసం ఇచ్చే ఫండ్‌ను కలెక్టర్ల పేరుతో ఏర్పాటు చేస్తున్నాం. మీ స్కూళ్లకు కలెక్టర్లు డబ్బులు బదిలీ చేస్తారు. మీ టాయిలెట్ల మెయింటెనెన్స్‌కు మాత్రమే వాడుతారు. టాయిలెట్ల నిర్వాహణ సరిగ్గా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఆ ఫోన్‌కు సీఎంవో రంగప్రవేశం చేస్తుంది. మన గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల మన బడులు, మన టాయిలెట్లు బాగుపడే పరిస్థితికి ఇది ఒక మార్గంగా నిలుస్తుంది. టాయిలెట్లు సరిగ్గా లేకపోవడంతో 12 శాతం నుంచి 20 శాతం మంది చదువులు మానేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. టాయిలెట్ల కోసం ఒక్క రూపాయి మనం ఖర్చు చేస్తే..రూ.34 ఫలితం ఇస్తుందని ప్రపంచ బ్యాంకు రిపోర్టుల చెబుతున్నాయి. 

ఈ రోజు నేను చెప్పబోయే మరో అంశం..అమ్మ ఒడి ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్కచెల్లెమ్మలు మరింత వినియోగించుకునేలా వచ్చే ఏడాది నుంచి మరో ప్రత్యామ్నయ ఆప్షన్‌ ఇస్తున్నాం. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లల తల్లులకు డబ్బులు కావాలంటే డబ్బుల తీసుకోవచ్చు. లేదంటే ల్యాప్‌టాప్‌లు కూడా ఇస్తాం. ఈ ల్యాప్‌ టాప్‌ రూ.27 వేలు అవుతుంది. దీన్ని ప్రభుత్వం పలుధపాలుగా కంపెనీలతో చర్చలు జరిపింది. రూ.18,500లకే ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.ఇందుకు కూడా రివర్స్‌ టెండరింగ్‌కు పిలుస్తాం. మరికొంత తగ్గే అవకాశం ఉంది. ప్రతి ల్యాప్‌ట్యాప్‌ కూడా 4 గిగాబైట్‌ రామ్, విండో ఆపరేటివ్‌ సిస్టమ్, తదితర సౌకర్యాలు ఉండేలా టెండర్లు పిలుస్తున్నాం. వసతి దీవెన అందుకుంటున్న తల్లులు కూడా ల్యాప్‌టాప్‌లు పొందవచ్చు. ఎందుకంటే..కోవిడ్‌సమయంలో పెద్ద స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాయి. పేదింటి పిల్లలు ఆన్‌లైన్‌ క్లాస్‌లకు దూరం అయ్యారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కంప్యూటర్‌ వినియోగించే విషయంలోనూ, ఇంగ్లీష్‌మీడియం చదివేందుకు ఇవి ఉపయోగంగా ఉంటాయి. బడిలో నాలుగు అక్షరాలు నేర్చుకుంటే, 8వ తరగతి నుంచి కంప్యూటర్‌ లిట్రసీ కోర్సు ప్రవేశపెడుతున్నాం. డబ్బు ఉన్న పిల్లలతో పోటీ పడేలా పరిస్థితులను పేద పిల్లలకు కల్పిస్తున్నాం. మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో ల్యాప్‌టాప్‌లు కొంటుంది..కాబట్టి మూడేళ్ల పాటు వారంటీ ఉండేలా ఒప్పందం చేసుకుంటాం. ఏడు రోజుల్లో రిపేరీ చేసేలా ఒప్పందం చేసుకుంటాం. రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేలా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు..వచ్చే మూడేళ్లలో ఇంటర్‌ నెట్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం. అండర్‌ గ్రౌండ్‌ కెబూల్స్‌ వేయడానికి రూ.5900 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నిర్వాహణ వ్యయం ఉంటుంది. అన్నింటిని బేరిజు వేసుకొని  ప్రతిగ్రామానికి ఇంటర్‌ నెట్‌ తీసుకెళ్తాం.

ఇంగ్లీష్‌ మీడియం ఫిబ్రవరి 1 నుంచి 55 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల పేర్లు కూడా మార్చబోతున్నాం. వైయస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ, ప్రి ప్రైమరీ 1,2, ఫస్ట్‌ క్లాస్‌ పేరుతో మార్చబోతున్నాం. ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆటలతో పాటలు, చదువులతో మానసిక వికాశం, రూ.1870 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంగన్‌వాడీల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు గత ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేసేది. పిల్లల బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఇవన్నీ చేయబోతున్నాం. 

గత ప్రభుత్వాలు పిల్లలకు ఓట్లు లేవు కదా అని పట్టించుకోలేదు. ఈ రోజు ఆ పిల్లలను పట్టించుకునే వారి మేనమామ సీఎం అయ్యారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లల బడుల కోసం స్కూల్‌ కిట్లు ఇచ్చాం. విద్యా కానుక పేరుతో క్వాలిటీ ఉన్న బ్యాగ్, బూట్లు, బెల్ట్, సాక్స్, నోట్‌ పుస్తకాలు చేతితో పట్టుకొని చూశాను. నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. ఇంగ్లీష్‌ మీడియం చదువులు, మధ్యాహ్న భోజనంలో మెనూ మార్చాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపుపై దృష్టి పెట్టాం. పెద్ద చదువులు ఆగిపోకూడదని ఆలోచన చేశాం.  పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పథకాన్ని తీసుకువచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.20 వేలు ప్రతి ఏటా ఇస్తున్నాం. కరిక్యూలమ్‌లో మార్పులు తీసుకువచ్చాం. అపరెంటిష్‌ అనే పదాన్ని తీసుకువచ్చాం. ఉద్యోగాలు వచ్చేలా కోర్సులు మార్చేశాం. ఇంటర్‌ నెట్‌ కూడా ప్రతి గ్రామానికి ఇవ్వబోతున్నాం. మన పిల్లలు వెనుకబడకూడదని మేనమామగా బాధ్యతలు తీసుకున్నా. 
అమ్మ ఒడి కార్యక్రమంలో 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలు భాగమయ్యారు. దేశంలో కనీవిని ఎరుగని విధంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.1200 కోట్లు, ఆసరా కింద రూ.6700 కోట్లు, వైయస్‌ఆర్‌ చేయూత కింద రూ.4400 కోట్లు , సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు , కాపు నేస్తం కింద అక్కాచెల్లెమ్మలకు మమకారంతో ఇస్తూ..ఎలాంటి వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకాలతో పాటు ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణం అక్క చెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ఆలయాల్లో ఉన్న ట్రస్ట్‌ బోర్డులు, సొసైటీ బోర్డులు, కార్పొరేషన్‌ పదవులు 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇస్తున్నాం. వారికి మేలు జరిగేలా చట్టాలు చేశాం. మహిళా చట్టాలను తిరుగరాస్తున్నాం..కాబట్టే ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుందని కడుపుమంటతో మాట్లాడుతున్నారు.

ప్రతిపక్షాల కడుపుమంట ఏ స్థాయిలో ఉందంటే..ఎవరూ లేని ప్రాంతాల్లో దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ తరువాత అక్కడికి వారే వెళ్తున్నారు. ఆలయాల్లో రథాలను తగులబెడుతున్నారు. రథయాత్రలు ఎందుకు చేయబోతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనం ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమం చూసినా..సరే మన పథకానికి ఒకటి రెండు, రోజులు అటో ఇటో ఎక్కడో ఒకచోట గుడులు, గోపురాలను చీకట్లో వెళ్లి టార్గెట్‌ చేస్తున్నారు. మనం చేసే మంచి ప్రజలకు తెలియకూడదని దుర్భుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడి మీద భక్తి లేని వారు పట్టపగలే గుడులను, విగ్రహాలను కూల్చి వేస్తున్నారు. చివరికి అమ్మవారి గుడుల్లో క్షుద్రపూజలు చేసిన వారు ఈ రోజు కొత్త వేషం కడుతున్నారు. దేవుడిపై ప్రేమ ఉన్నట్లు డ్రామాలు.

కోవిడ్‌ భయంతో ప్రతిపక్ష నేత, ఆయన కొడుకు హైదరాబాద్‌లో దాక్కుంటారు. సామాన్యులు చస్తే ఎంత..బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామంటూ బాబు గారి కోవర్టులు ఎలా ఉన్నారో ఆలోచన చేయండి. ప్రతి పేదింటి పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తే అడ్డుతగిలేందుకు దుర్మార్గంగా ఆర్డర్లు ఇచ్చే పరిస్థితిని గమనించండి. చీకటి పనులు తెలిసిన వారు, వెన్నుపోటు పొడిచేవారు. దొంగదెబ్బ తీసేవారు..వ్యవస్థలో ఉన్న కోవర్టులు..ప్రజలకు మంచి చేసిన చరిత్ర వారిలకి లేదు కాబట్టి..మంచి చేసే వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆరాటపడుతున్నారు. వీరంతా నిన్న గుడుల్లో విగ్రహాలు పగులగొట్టారు. రేపు బడులపై కూడా పడతారేమో? అక్కాచెల్లెమ్మలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా. ఈ రోజు అక్కచెల్లెమ్మలు ఇలాంటి శక్తులు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం ఎదుగుతూ ఉంటే..ఇలాంటి వ్యక్తులు, శక్తులు ముందుకు వస్తారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పే విషయంలో ఆలోచన చేయండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను.  ఇలాంటి మరెన్నో కార్యక్రమాల ద్వారా మీకు మంచి చేసే శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాలని, మీకు మరింత మంచి జరగాలని కోరుకుంటూ ..ఇక్కడి నుంచి బటన్‌నొక్కిన వెంటనే నేరుగా మీ బ్యాంకు ఖాతాలో రూ.14 వేలు జమ అవుతుంది. మరో రూ.1000 మీ జిల్లా కలెక్టర్‌ టాయిలెట్‌ ఫండ్‌లోకి జమ అవుతుందని చెబుతూ..ఇక బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.. అంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Back to Top