నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

జీఐఎస్‌-2023 వేదిక నుంచి వర్చువల్‌గా ప్రారంభం

విశాఖ: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 వేదిక నుంచి రాష్ట్రంలో నెలకొల్పిన నూతన పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీసిటీ, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన పారిశ్రామిక యూనిట్లను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సర్బానందతో కలిసి సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం రూ. 3,845 కోట్లతో నిర్మించిన పరిశ్రమలను సీఎం వైయస్‌ జగన్‌ జీఐఎస్‌–2023 వేదిక నుంచి ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 9,100 మందికి ఉపాధి లభించనుంది. 

– రూ.700 కోట్లతో శ్రీసిటీలో నిర్మించిన కింబెర్లి క్లార్క్‌ పరిశ్రమను సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ఉపాధి కల్పించనుంది. 

– రూ.540 కోట్లతో నిర్మించిన బ్లూస్టార్‌ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి లభించనుంది. 

– రూ.300 కోట్లతో నిర్మింంచిన హ్యావెల్స్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా 1000 మందికి ఉపాధి లభించనుంది.

– రూ.176 కోట్లతో నిర్మించిన యాక్సెలెన్‌ ఫార్మా సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 550 మందికి ఉపాధి లభించనుంది. 

– రూ.185 కోట్లతో నిర్మించిన ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా 118 మందికి ఉపాధి. 

– రూ. 95 కోట్లతో నిర్మించిన వీఆర్‌వీ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 200 మందికి ఉపాధి.  

– అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రూ.460 కోట్ల నిర్మించిన లారస్‌ ల్యాబ్‌ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి.

– అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రూ. 60 కోట్లతో నిర్మించిన అమర లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 190 మందికి ఉపాధి.

– కంతకపల్లిలో రూ.152 కోట్లతో నిర్మించిన శారద మెటల్స్‌ అండ్‌ అలోయ్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా 300 మందికి ఉపాధి.

– అచ్చుతాపురంలో రూ.174 కోట్లతో నిర్మించిన విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 500 మందికి ఉపాధి.

– అనకాపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించిన ఏఓవీ అగ్రో ఫుడ్స్‌ యూనిట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 1000 మందికి ఉపాధి

– ప్రకాశం జిల్లాలో రూ.30 కోట్లతో నిర్మించిన ఎస్‌హెచ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 50 మందికి ఉపాధి.

– విజయవాడలో రూ.690 కోట్లతో ఏర్పాటు చేసిన అవేరా మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎలక్ట్రికి బైక్స్‌) యూనిట్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. 

Back to Top