రేపు ఒంగోలుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వరసగా రెండో ఏడాది వైయ‌స్‌ఆర్‌ ఆసరా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న సీఎం 

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈనెల 7వ తేదీన ఒంగోలులో ప‌ర్య‌టించ‌నున్నారు. వరసగా రెండో ఏడాది వైయ‌స్‌ఆర్‌ ఆసరా ప‌థ‌కాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైయ‌స్‌ జగన్ ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు సీఎం టూర్‌ షెడ్యూల్‌ను సీఎం కార్యాల‌యం విడుద‌ల చేసింది. 7వ తేదీ ఉదయం 9:55 గంటలకు తాడేపల్లిలోని త‌న నివాసం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఒంగోలు బయలుదేరనున్నారు. 11 గంటలకు ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వైయ‌స్‌ఆర్‌ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్‌ పరిశీలన అనంతరం సభా వేదిక వద్ద లబ్దిదారులతో ముఖాముఖి, ప్రసంగం తర్వాత వైయ‌స్‌ఆర్‌ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:05 నిముషాలకు తిరుగు పయన‌మై.. 1:55 నిముషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top