ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

విశాఖపట్నం: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. 

విశాఖ ఐటీహిల్‌ నంబర్‌2 వద్ద నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని పరిశీలించి.. ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట వైయస్‌ఆర్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు.

మరికాసేపట్లో బీచ్‌ క్లీనింగ్‌కు సమకూర్చిన యంత్రాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. అనంతరం పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలో ఫార్మా యూనిట్లను ప్రారంభించనున్నారు. 
 

Back to Top