విజయనగరం: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం.. అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం వైయస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. వైద్య రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మెడిసిన్ చదువుకోవాలనే తమకు అండగా నిలిచినందుకు తమ కలను సాకారం చేస్తున్నందుకు సీఎం వైయస్ జగన్‌కు విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వర్చువల్ విధానంలో రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల విద్యార్థులతో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు.