కదిరి రోడ్డు జంక్షన్, పులివెందుల కూరగాయల మార్కెట్‌ ప్రారంభించిన సీఎం

పులివెందుల: వైయస్‌ఆర్‌ జిల్లాలో రెండో రోజు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతోంది. ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి బ‌య‌ల్దేరి పులివెందుల‌లో కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అదే విధంగా పులివెందుల కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. మరికాసేపట్లో పులివెందులలో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ వైయస్‌ఆర్‌ బస్‌ స్టాండ్‌ను ప్రారంభించనున్నారు. 
 

Back to Top