రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది

విద్యావ్యవస్థను మార్చే ప్రయ్నతం చేస్తున్నాం

ప్రైవేటు బడుల్లో తెలుగు మీడియం ఎందుకు బోధించట్లేదు?

ఇంటర్‌నెట్, కంప్యూటర్‌ భాషలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి

ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి వికేంద్రీకరణ ప్రతిపాదనలు

విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని

ది హిందు సమ్మిట్‌లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

విజయవాడ: ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్పిన బాధ్యత నాపై ఉందని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ది హిందు పత్రిక సమ్మిట్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. తాము కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదని, మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయ్నతం చేస్తున్నామని వైయస్‌ జగన్ అన్నారు.  'ప్రైవేటు బడుల్లో తెలుగు మీడియం ఎందుకు బోధించట్లేదు? ఇంగ్లిషు మీడియం అనేది ఇప్పుడు కనీస అవసరం. ఇంటర్‌నెట్, కంప్యూటర్‌ భాషలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి?' అని వ్యాఖ్యానించారు.
'ఈ రోజు మనం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభిస్తే రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల్ని తెలుగు మీడియం బడికి పంపగలమా? పేద పిల్లలు మాత్రమే ఎందుకు తెలుగు మీడియంలో చదవాలి? వారిని బలవంతంగా ఎందుకు తెలుగు మీడియం చెప్పే పాఠశాలలకు పంపాలి? ఇంగ్లిష్‌ మీడియంతో చదివితే పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకుంటారు' అని వైయస్‌ జగన్ చెప్పారు. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి వికేంద్రీకరణ ప్రతిపాదనలు చేశాను. చంద్రబాబు మాదిరిగా గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెట్టాలని అనుకోలేదు. నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెప్పా. జపాన్‌, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవనే నాకు తెలుసు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు  ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని.  ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. విశాఖలో సచివాలయం, హెచ్‌వోడీ, ముఖ్యమంత్రి కార్యాలయాలు ఉంటాయి. ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశాం. ఉగాది నాటికి ఇల్లు లేని పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.  
 

తాజా వీడియోలు

Back to Top