చిన్నారి కుటుంబానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ధైర్యం..

 తక్షణ సాయం.. చెక్కు అందజేత 
 

కృష్ణా: సాయం కోరితే చాలూ.. అప్పటికప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  ఆ విషయంలో ఆయన మంచి మనసుకు అద్దం పట్టే సందర్భాలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా విజయవాడలోనూ ఓ నిరుపేద కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. 

శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్‌ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్‌ హాల్‌కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్‌ దగ్గరికి తీసుకెళ్లారు. 

చిన్నారి స్థితి గురించి తెలుసుకున్న సీఎం జగన్‌ అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ప్రక్కనే వున్న ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరు డా. పి సంపత్ కుమార్ కుమార్ ను తక్షణ ఆర్ధిక సహాయానికి ఆదేశించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో.. జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించుకుని రూ. లక్ష చెక్కును తక్షణ సాయం రూపంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సాయం అన్నివిధాల అందజేస్తామని హామీ ఇచ్చారు.

Back to Top