నేడు ఢిల్లీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రెండ్రోజుల పాటు హ‌స్తిన‌లో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌

నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ఈరోజు మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి శ్రీ‌కాకుళం జిల్లా  బ‌య‌ల్దేరిన సీఎం.. ఆముదాల‌వ‌ల‌స‌ జూనియ‌ర్ కాలేజీ మైదానంలో జ‌రిగే శాస‌న‌సభ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుక‌లో పాల్గొంటారు. పెళ్లి వేడుక అనంత‌రం సాయంత్రం విశాఖపట్నం నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్‌ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌ చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఏడవ సమావేశంలో సీఎం పాల్గొంటారు. స‌మావేశం అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top