మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు కొనుగోలు చేశారు

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కొన్ని కంపెనీలతో లాభం చేకూరేలా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు 

టీడీపీ ప్రభుత్వం రూ.2654 కోట్లకు విద్యుత్‌ కొనుగోలు చేసింది

థర్మల్‌ పవర్‌ యూనిట్‌ రూ.4.20 అందుబాటులో ఉంది

 విండ్‌ పవర్‌ను యూనిట్‌ రూ.4.84కు  ఒప్పందం కుదుర్చుకున్నారు

పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు లేకపోగా ఎక్కువ ధరలకు విద్యుత్‌ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉంటే ఎందుకు కొనుగోలు చేశారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. పీపీఏలపై జరిగిన చర్చలో గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సీఎం ఎండగట్టారు.గత ప్రభుత్వ కరెంటు కొనుగోలు ఒప్పందాలపై నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,  చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు అధికారులపై, ప్రభుత్వం బాధ, అక్కస్సు వెళ్లిబుచ్చారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. నిపుణుల కమిటీని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పీపీఏలపై సమీక్ష అనగానే చంద్రబాబు భయపడిపోతున్నారని పేర్కొన్నారు.  చంద్రబాబు కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ చూపిస్తున్నారు. సీఈఆర్‌సీ గైడ్‌లైన్స్‌ ఏపీఈఆర్‌సీ ఫాలోకాదు. ఈ విషయం నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదని చెప్పారు.

ఏపీఈఆర్‌సీ గైడ్‌లైన్‌ ప్రేమ్‌ చేసి..దాని ప్రకారం అందరికీ రెనేవబుల్‌ పవర్‌గురించి అందరికి తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోళ్ల మీద కమిటీ వేశామన్నారు. ఏపీఈఆర్‌సీ మన రాష్ట్రానికి ఆర్పీవోలను నిర్దేశిస్తోందన్నారు. రెవెన్యూబుల్‌ పవర్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీవో) పరిశీలిస్తే 2015–2016కు సంబంధించి పీఆర్‌వో 5 శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకపోయినా కూడా, ఎక్కువ రేటు ఇస్తున్నామని తెలిసి కూడా 5.59 శాతానికి విద్యుత్‌ కొనుగోలు చేసిందన్నారు. 2016–17లో 8.6 శాతం, 2017–2018లో 19 శాతం, 2018–19లో 11 శాతం కొనుగోలు చేయమని ఏపీఈఆర్‌సీ కొనుగోలు చేయమంటే 23.4 శాతం ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారు. మూడేళ్లలోనే ఉన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేయడంతో మనం ఎక్స్‌ట్రా రేటు ఇవ్వడంతో రూ.2654 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఒప్పందాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే..గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటుకు రూ.4.86 యూనిట్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రతి సారి కూడా మనం థర్మల్‌ పవర్‌ యూనిట్‌ రేటు తక్కువగా ఉంది. థర్మల్‌ రూ.4.20 యూనిట్‌కు కరెంటు వస్తుంది. థర్మల్‌ పవర్‌ వద్దు అంటూ బ్యాక్‌డౌన్‌ చేస్తూ విండ్‌ పవర్‌ను కొనుగోలు చేశారు. థర్మల్‌ పవర్‌ను వెనక్కి ఇచ్చినందుకు మనం రూ.1.10 ఫిక్స్‌డ్‌ క్యాస్ట్‌ చెల్లించాల్సి వచ్చింది. ఇదంతా చంద్రబాబుకు తెలిసి కూడా కొనుగోలు చేయకుండా థర్మల్‌ పవర్‌ను పక్కన పెట్టారు. దీంతో అక్షరాల రూ.5.94 యూనిట్‌ కరెంటును విండ్, సోలర్‌ కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల మనకు వచ్చిన నష్టం రూ.1.74 నష్టం వచ్చింది. ఏడాదికి రూ.2764 కోట్లు మనకు తెలిసి నష్టపోవాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో మనం పోల్చితే తక్కువ రేటు ఎక్కడ ఉంటుందని అందరికి తెలుస్తుంది. తక్కువ రేటుకు పవర్‌ అందుబాటులో ఉందని తెలిసి కూడా మనం ఎందుకు పీపీఏలు ఇలా చేసుకున్నమన్నది చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితి గమనిస్తే..గుజరాత్‌లో రూ.2.43 అందుబాటులో ఉంది. అధికంగా ఇచ్చే రేటు రూ.3831 కోట్లకు నష్టం వస్తుంది. సోలార్‌ కూడా అదే మాదిరిగా జరిగింది. విండ్‌లో చంద్రబాబు కుదుర్చుఉన్న అగ్రిమెంట్లు పరిశీలిస్తే..కేవలం ముగ్గురే ముగ్గురు ఉన్నారు.

63 శాతం కుదుర్చుకున్న ఒప్పందాలు మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఏ స్థాయిలో దోచేశారు అని చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. ఆర్‌పీపీవో లిమిట్స్‌ తీసుకుంటే కొందరికి లాభం చేకూర్చేందుకు ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేశారు. నాలుగేళ్ల కాలంలో కొనుగోలు చేసింది రూ.6952 కోట్లు స్కామ్‌ జరిగింది. మనకు రెన్యూబల్‌ ఎనర్జీ కొనడం వల్ల కేంద్రం నుంచి ఇన్సెటివ్‌ వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే ఇన్సెటివ్‌కు మనం కక్కుర్తి పడాలా? మనకు వచ్చే నష్టాన్ని చూడాలా గమనించాలి. టెక్నాలజీ వల్ల రేట్లు తక్కుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. వాస్తవమే టెక్నాలజీ వల్ల రేట్లు తక్కుతాయని చంద్రబాబుకు శృహ ఉంటే 25 ఏళ్లకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిగతా రాష్ట్రాలతో నేను పోల్చడం లేదని, మన రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ రేట్లను మాత్రమే పోల్చుతున్నాను.

ఇదే మాదిరిగా 25 ఏళ్లు జరిగితే నష్టపోవాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలతో కంపేర్‌ చేస్తే ఇంకా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలపై భారం మోపడం ధర్మమేనా? అని ప్రశ్నిస్తున్నాను. ఏపీఈఆర్‌సీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను ఎవరిని పెట్టాలని ఇదే సభలో చట్టం తీసుకువచ్చారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను తెచ్చుకునేందుకు చట్టాన్ని పూర్తిగా మార్చారు. 65 ఏళ్ల వయసును 70 ఏళ్లకు పెంచుతూ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. ఇంతదారుణంగా కావాల్సిన వ్యక్తులను తీసుకువచ్చి స్కామ్‌లు చేశారు. చంద్రబాబు ప్రసంగంలో ఏపీ డెప్‌సిట్‌ పవర్‌లో ఉందని చెప్పారు. ఎనర్జీ సర్‌ప్లస్‌ రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందని చెబుతున్నారు. ఒక్కవైపు ఎనర్జీ సర్‌ఫ్లస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు మనం మాత్రం పీపీఏలపై ఎందకు సంతకాలు పెడుతున్నారు. మామూలుగా వ్యవసాయానికి సబ్సిడీ ఇస్తాం. పరిశ్రమల నుంచి గ్రాస్‌ వ్యాల్యూ సెక్టామ్స్‌ 25.48 శాతం వస్తుంటే, వాళ్లు తగ్గిపోతున్నారు.

ఎలాంటి ప్రోత్సాహం పరిశ్రమలకు లేదు. కరెంటు రేట్లు షాక్‌ కొట్టించారు. దీనివల్ల పరిశ్రమలు నిర్వీర్యమయ్యాయి. ఏపీఎస్సీడీసీఎల్‌ పరిస్థితి చూస్తే మన వద్ద ఉన్న రెండు కంపెనీల వద్దే సదన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ వద్దే పెట్టారు. కాస్ట్‌ ఆఫ్‌ పర్చేస్‌ చూస్తే..2018–2019 రూ.14.965 ఉందని వివరించారు. డిస్కామ్‌లన్నీ కూడా నష్టాల బాటలో పడటానికి ఇంతకన్న ఊదాహరణ లేదన్నారు. ఇవి బతకాలంటే గవర్నమెంట్‌ సబ్సిడీ పెంచుతూపోవాలి. రాష్ట్రం ఈ రకంగా సబ్సిడీలు ఇచ్చే స్థితిలో ఉందా అన్నది
గమనించాలి. ఈ రకంగా స్కామ్‌లు చేసుకుంటు వెళ్తే ప్రజల నెత్తిన భారం పడుతుంది. ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. అగ్రిమెంట్లు చూస్తే మూడు కంపెనీలు మాత్రమే కనిపిస్తున్నాయంటే ఇవి స్కామ్‌లు కాక మరేంటి? ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని కాపాడేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top