త‌ల‌శిల ర‌ఘురాం స‌తీమ‌ణి భౌతిక‌కాయానికి సీఎం దంప‌తుల నివాళి

ఎమ్మెల్సీ ర‌ఘురాంను ప‌రామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ భార‌తి 

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న మండ‌లి స‌భ్యులు త‌ల‌శిల రఘురాం స‌తీమణి స్వ‌ర్ణ‌కుమారి మృతిపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ గొల్ల‌పూడిలోని త‌ల‌శిల ర‌ఘురాం నివాసానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్, వైయ‌స్ భార‌తి దంప‌తులు.. స్వ‌ర్ణ‌కుమారి పార్థీవ‌దేహానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ర‌ఘురాంను ప‌రామ‌ర్శించి వారి కుటుంబ స‌భ్యుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు ఓదార్చారు. 

Back to Top