బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: తూర్పుగోదావరి జిల్లాలోని బెంగపూడి విద్యార్థులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. విద్యార్థుల‌ ప్రతిభకు ఫిదా అయిన‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌… తనను కలవటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. దీంతో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఐదుగురు విద్యార్థులు, ఇంగ్లీష్ టీచర్.. విద్యార్థులతో సంభాషించి వారిని అభినందించారు. 
బెండపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల భాషా నైపుణ్యం ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.. బెండపూడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.. ఓ మారుమూల గ్రామంలోని పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు ఏకాంగా అమెరికా విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడడంతో.. బెంగపూడి విద్యార్థులు, టీచర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఇది సీఎం వైయ‌స్ జగన్‌ దృష్టికి కూడా వెళ్లడంతో.. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top