జాతిని గర్వపడేలా చేశారు 

హాకీ జట్టుకు సీఎం వైయ‌స్ జగన్‌ శుభాకాంక్షలు
 

అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తేడాతో భారత్‌ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ పతకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్‌ప్రీత్‌ సేనను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు.

కాగా గురువారం నాటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top