తాడేపల్లి: ప్యారిస్‌లో తమ కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తె హర్ష ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ నుంచి పట్టా సాధించడంపై సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ''డియర్ హర్ష, నీ అద్భుతమైన ఎదుగుదలను చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్‌సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి డిస్టెంక్షన్‌లో పాస్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను' అంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. https://twitter.com/ysjagan/status/1543218061393948672?s=20&t=BhUnkCwifhTnMbpum1wMEQ