విద్యార్థుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఐఐటీ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. ఐఐటీ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. విద్యార్థుల‌ను అభినందించిన సీఎం.. వారికి  ల్యాప్‌టాప్‌లు బహుకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె. సునీత, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top