ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సీఎం వైయ‌స్ జగన్ సంతాపం

తాడేపల్లి: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతిపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ గ్రామీణ రూపురేఖలను సమూలంగా మార్చారు. పద్మవిభూషణ్, మెగసెసె అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్‌ వ్యవసాయ రంగానికి ఆయన  చేసిన కృషి అభినందనీయం. స్వామినాథన్ కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసింది’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట​ చేశారు.

భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్‌.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు.

 

Back to Top