కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతి ప‌ట్ల‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ``గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top