తుర్లపాటి మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి ప‌ట్ల సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు  తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ రావు గొప్ప రచయిత, వక్త అని.. సాహిత్య రంగానికి, జర్నలిస్టుగా ఆయ‌న అందించిన సేవలను సీఎం కొనియాడారు. తుర్లపాటి కుటుంబరావు(89) గుండెపోటుకు గురై.. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. 

Back to Top